నల్లని నిగనిగలాడే జుట్టు కోసం ఖరీదైన ఉత్పత్తుల కంటే మందారం పూవు ఎంతో మేలు చేస్తుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్ .మందారం పూలని ఎండబెట్టి పొడిగా తయారు చేసుకోవాలి . మూడు స్పూన్ల్ మందారం పొడిలో ఆర కప్పు పెరుగు కలిపి తలకు పూతలాగా వేసుకోవాలి. ఓ ఆర గంట ఆగి తలస్నానం చేస్తే జుట్టు పట్టు కుచ్చులా మొత్తగా తయారవుతోంది. మందార పూల పొడిని పాలలో కలిపి ఆ మిశ్రమాన్ని మాడుకు పట్టిస్తే జుట్టు రాలటం తగ్గిపోతుంది. పొడిబారి కాంతిహీనంగా కనిపించే జుట్టు కు మందార పూలు,గుంట గలగారకు సమానంగా తీసుకొని,మెత్తగ గుజ్జులాగా చేసి,ఆ మిశ్రమంలో నిమ్మరసం కలిపి తలకు పూతలాగా వేసి ఓ ఆర గంట ఆగి కడిగేసుకోవాలి. వారానికి ఒకసారి ఈ పూత వేస్తే జుట్టు ఆరోగ్యంగా మారుతోంది.

Leave a comment