పిల్లల తెలివి తేటలు పెంచే కార్యక్రమాలు ఎంపిక చేస్తే వాళ్ళు కార్టూన్ ఛానెల్స్ చూడటం వల్ల పెద్ద నష్టం లేదంటున్నారు . కార్టూన్లు చూపిస్తూ వాళ్ళకు నెమ్మదిగా కామిక్ పుస్తకాలు అలవాటు చేయవచ్చు . చూసే కార్టూన్ లు పిల్లల్లో చదివే అలవాటును కళాత్మకంగా ఆలోచన శక్తిని పెంచుతాయి. వాళ్ళలో భాషానైపుణ్యాలు మెరుగు పడతాయి. పదాలు ఎలా పలకాలో సులభంగా నేర్చుకొగలుగుతారు. మంచి ఇంగ్లీష్ నేర్చుకొగలుగుతారు. అయితే దేనికైన మితం ఉంటుంది. వాళ్ళకు ఎంత వరకు ఉపయోగమో పెద్ద వాళ్ళు ఒక విచక్షణతో నిర్ణయించాలి. పనులకు అడ్డం వస్తారని టీవి ముందు కూర్చొబెడితే అదే సమస్య అయి కూర్చుంటుంది.

Leave a comment