శిరోజాలకు ఎదో ఒక దువ్వెన తో దువ్వవద్దనీ కొన్ని ప్రత్యేకమైన బ్రష్ ప్రత్యేకమైన శిరోజాలకు మేలు చేస్తాయని చెపుతున్నారు. ఎక్స్ పెర్ట్స్ ఒత్తయిన  జుట్టున్న వాళ్ళు స్టర్చి నైలాన్ బ్రష్ లు ముఖ్యంగా చివరలో గుండ్రంగా బాల్ మాదిరిగా ఉండేవి వాడితే అవి మాడుకు హాని చేయవు. వైర్ బ్రిస్టల్స్  కూడా ప్రయత్నం చేయవచ్చు. పల్చని శిరోజాలు ఉంటే బ్రష్ కొనే సమయంలో బ్రిస్టల్స్ బాగా మృదువుగా వున్న వాటిని ఎంచుకోవాలి. వెంట్  బ్రెష్ లు ముఖ్యంగా హేయిర్ డ్రయ్యర్ తో స్టయిల్ చేసినవి జుట్టు కుదుళ్ళని వ్యాల్యుమ్ ఇస్తాయి. మీడియం హేయిర్ అయితే పెద్ద సమస్యలు లేకుండా అన్ని రకాల హేయిర్ బ్రెష్ లు దువ్వెన లు ఒకే మాదిరి పనిచేస్తాయి. దువ్వుకున్నప్పుడు మాడుకు మసాజ్ చేసినట్లు ఉండాలి. ఇక కర్ల్  హేయిర్ అయితే తేలిగ్గా పైపైన బ్రష్ చేయాలి. స్టయిల్ లేదా హెవీ హేయిర్ మాదిరి కాకుండా జుట్టు పొడిబారక ముందు తడిగా ఉన్నప్పుడే దువ్వుకోవాలి. బ్రిస్టల్స్ లేదా దువ్వెన పళ్ళ నడుమ ఖాళీ ని బట్టి ఎంతసేపు దువ్వుకోవచ్చు మనకే తెలిసిపోతుంది. సాధ్యమైనంత వరకు గబగబా తెగిపోయేంత స్పీడ్ గా జుట్టు దువ్వుకోకూడదు.

Leave a comment