చాలా చిన్న పిల్ల గా ఉన్నప్పటి నుంచే నా శరీరాకృతి గురించి అసభ్యమైన కామెంట్స్ విన్నాను నా శరీరం తీరు గురించి అంత చిన్న వయసులో బాడీ షేమింగ్ ఎదురవడంతో మానసికంగా ఎంతో కృంగిపోయాను. అదెంత దూరం పోయింది అంటే నేను సినిమాల్లో సక్సెస్ ఫుల్ గా ఉన్నప్పుడు మనసులో ఒక కాంప్లెక్స్ నేను అందంగా లేనని…అందులో నుంచి బయటపడేందుకు వైద్యుల సలహాలు తీసుకోవాలిసి వచ్చింది అంటూ ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది నటి ఇలియానా .ఇప్పుడిక ధైర్యం తెచ్చుకున్నా ఎవరెలా అనుకున్నా నాకు నష్టం లేదు. నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావు అది ముఖ్యం అని ప్రతి రోజు నాకు నేనే ధైర్యం చెప్పుకుంటాను నేను ఇన్నేళ్ల అనుభవంతో ఒక్కటే చెబుతున్నా .మీ గురించి ఎవరేం కామెంట్స్ చేసినా పట్టించుకోవద్దు అంటోంది ఇలియానా.
ReplyReply allForward
|