Categories

కరోనా వైరస్ కు టీకా వచ్చేవరకు జాగ్రత్తలు తప్పని సరి.పరిశుభ్రతకు పెద్ద పీట వేయవలసిన సమయం ఇది.ఇల్లు, ఆఫీస్,ప్రయాణ మధ్యమాలు బహిరంగ ప్రదేశాలు ఇలా ప్రతి ప్రదేశము శుభ్రంగా ఉంచుకోవాలి మెట్ల పక్కల రైలింగ్స్ తలుపు డెస్క్.చేతులు తాకే వీలున్న ప్రతి ఉపరితలం కూడా సోడియం హైపో క్లోరైడ్ ఉన్న శానిటైజర్ తో శుభ్రం చేసుకోవాలి.ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో హ్యాండ్ శానిటైజర్ వెంట తీసుకుపోవాలి. చేతులు కలిపి అభివాదం చేయటం మానేయాలి ముక్కు నుంచి గడ్డం వరకు కప్పి ఉండే మాస్క్ ధరించక పోతే రక్షణ దొరకటం కష్టమే .