Categories
ఇప్పుడు చిరు దాన్యాలే ఆరోగ్యవంతమైన ఆహారం అయిపోయింది. నెమ్మదిగా తెల్లని బియ్యం పంచదార వంటి వాటికి స్వస్థి పలుకుతున్నారు. ఎన్నేళ్ళ వయస్సు న్న సరే జొన్నలు,సజ్జలతో చేసిన రొట్టెలు శక్తినిస్తాయని వైద్యులు చెపుతున్నారు. చిరు ధాన్యాలు,సజ్జలు,జొన్నలు అందుబాటులో ఉండేవి వీటిని మరపట్టినా పొట్టు వాటిలోనే ఉంటుంది. కనుక ఈ పిండిలో పీచు ఉంటుంది. ఫాలిపెనాల్స్ కూడా ఈ పిండిలో ఉంటాయి. కనుక ఈ రొట్టెలు తీసుకుంటే రక్తంలో చెక్కరస్తాయి హెచ్చు తగ్గు లేకుండా ఉంటాయి.అలాగే తేలికగా జీర్ణం అవుతాయి. చిరు ధాన్యాలను అలవాటు చేసుకునే సమయంలో రుచిగా అలవాటైన రూపంలో తయారు చేసుకుని తీసుకుంటే బావుంటుంది.