చాలా మందికి జుట్టు పొడుగ్గా వుంటుంది కానీ పాపిట దగ్గర పల్చగా మాడుపై జుట్టు అనిగిపోయి నట్లుంటుంది. ఇలా వుంటే స్టయిలింగ్ చాలా కష్టం వెంట్రుకలు లాగి దువ్వుకోవాలి గనుక మాడు పైన, పాపిట దగ్గర జుట్టు చాలా త్వరగా ఊడిపోతుంది. జుట్టు పల్చగా వున్న చూట ఆముదం వేసి మసాజ్ చేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే ఫలితాలు కనీసం రెండు నెలల్లో తెలిసిపోతాయి. చిన్ని చిన్ని వెంట్రుకలు పెరగడం మొదలు పెడతాయి. వారానికి ఒక్క సారి గూరు వెచ్చని కొబ్బరి నూనె అప్లయ్ చేసి మసాజ్ చేసుకోవాలి. ఇలా చేస్తే జుట్టు కుదుళ్ళకు అదనపు బలం, పోషకాలు లభిస్తాయి. ఒక్కసారి పొడవాటి జుట్టు కుడా కుడుల్లను లగేస్తుంది. అప్పుడు సాధ్యమైనంత సేపు, కనీసం ఇంట్లో వున్నాంతసేపు ముడి వేసుకుని వుంటే కుదుళ్ళు లాగేయకుమ్డా ఉంటాయి.
Categories