ఒక్కరే ఇంట్లో వుంటే బోర్ కొట్టేస్తుంది. కాసేపు టి.వి చూసే కాసేపు ఫోన్ మెసేజ్ లు చేసి ఇంకా బోర్ అనిపించేలోపే ఎదురుగా వున్న చిప్స్ పాకెట్ చేతిలోకి వస్తుంది. ఖాలిగా వుంటే ఏదైనా తినాలని అనిపించేస్తుంది. దీనికి కారణం మనిషి వొంటరిగా వుండే గ్రెల్లిన్ అనే హార్మోన్ విడుదల అవ్వుతుంది. అలా ఎక్కువ అవగానే ఎదోటి తినాలనిపిస్తుంది. దీన్నుంచి బయటపడాలంటే ఎదో పనిలో బిజీగా వుండటమే. అలాగే ఇంట్లో సాధ్యమైనంత జంక్ ఫుడ్ తెచ్చి పెట్టొద్దు. అలాగే ఫ్రిజ్ లో ఎక్కువ క్యాలరీలు వుండే చిప్స్, కూల్ డ్రింక్స్, క్రిమ్ బిస్కట్స్ కూడా పెట్టోద్దు. మనస్సు పైన వత్తిడి వున్నా కూడా ఎదో ఒక్కటి తినాలనే కోరిక వుంటుంది. వత్తిడి వల్ల శారీరం లోని కొవ్వు నిల్వలను శక్తిగా మార్చే జీవక్రియలను ప్రేరేపిస్తుంది. ఒత్తిడి తగ్గంగానే కార్టిసాల్ విడుదల అవుతుంది. దీనితో ఆకలేస్తుంది. ఇది కేవలం హార్మోన్ల మాయ. కేవలం ఒత్తిడితగ్గేలా కాసేపు బయటికి మనుష్యులున్న చోటికి వాకింగ్ కి వెళ్ళినా చాలు ఈ సమస్యలుండవు.
Categories