ప్రపంచం మారిపోయిందని అప్పుడప్పుడు చాలా భ్రమ కలుగుతూవుంటుంది. కళ్ళు మిరిమిట్లు గొలిపే వెలుగు కనపడుతుంది. నింగిన మెరిసిన తరల్లాంటి కొందరు విజేతలను చూసి ముచ్చట పడేంత లోపే ఎక్కడో అంధకారపు ఒక ఆర్తనాదం కాళ్ళు నెలకు ఆనేలా చేస్తుంది. రుతుస్రావం పై అపోహలు అపవిత్రత ముద్రలు కొత్తవి కావు. మన దేశంలో ఆ మూడు రోజులు ప్రత్యేకమైన గది కేటాయించే పద్దతి వుంది. పొరుగు దేశం నేపాల్ లో చౌపది అనే పేరుతో ఊరికి దూరంగా గుడిసెలు కడతారు. అమ్మాయిలు అక్కడే ఉండాలి. అక్కడి ప్రభుత్వం 2005 లో చట్టం తెచ్చినా ప్రయోజనం లేదు. ఈ దురాచారానికి వ్యతిరేకంగా నేషనల్ పబ్లిక్ రేడియో ప్రచారం చేస్తుంది. ఈ గుడిసెల్లో గ్రామం బయట ఉండటం వల్ల కూడా జంతువుల భయం ఉంటుంది. ఈ మధ్య కాలంలో ఇరవై ఆరేళ్ళ అమ్మాయి గుండె పోటుతో అరుపులు ఊరివారు వినక నిస్సహాయంగా చనిపోయిందని రేడియో చెపుతోంది. గత తొమ్మిదేళ్లలో మహిళలు పురుగు పుట్రా కుట్టి చనిపోయారట.
Categories