ప్రపంచంలో ప్రసిద్ధ సెలబ్రిటీ జంటల్లో ప్రియాంక చోప్రా నిక్ జోనాస్ లను స్టయిలిస్ట్ కపుల్ గా పిలుస్తారు.ఇరవై ఏళ్ళనాడు ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న ప్రియాంక స్వశక్తితో అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. ఇప్పటివరకు అరవై సినిమాల్లో నటించిన ప్రియాంక ఆస్తుల విలువ అక్షరాలా 367 కోట్ల రూపాయలు. సినిమాలు, టెలివిజన్ షోలు వెబ్ సిరీస్ తో పాటు ఎన్నో కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేస్తోంది. ఒక్క సినిమాకు పది కోట్ల వరకు పారితోషకం తీసుకుంటుంది.అమెరికాలో క్వాంటికో సీజన్స్ లో ఒక ఎపిసోడ్ కు నాలుగు కోట్ల రూపాయలు తీసుకుంది.ఎన్నో చారిటీ సంస్థలకు విరాళం ఇస్తుంది.స్వంతంగా నెలకొల్పినది ప్రియాంక చోప్రా ఫౌండేషన్ ఫర్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తోంది ప్రియాంక చోప్రా.

Leave a comment