Categories
అందాన్ని పెంచే సౌందర్య చికిత్సలు ఇంట్లోనే చేసుకోవచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్ . మొటిమలు ఇబ్బంది పెడుతూ ఉంటే వేప ఆకు నూరి మొహానికి పట్టించి పూర్తిగా ఆరిన తరువాత కడిగేయాలి ఇలా వారం రోజులు చేస్తే మొటిమలు వాటి తాలూకు మచ్చలు తగ్గుతాయి.ప్రతిరోజు ఉసిరి రసం తాగితే చర్మం మెరుపుతో మెరుస్తుంది .గానుగ నుంచి తీసిన కొబ్బరినూనె చర్మానికి వెంట్రుకలకు మేలుచేస్తుంది. వెంట్రుకలు పట్టులా మెత్తగా రావాలంటే కొబ్బరి నూనె వేడి చేసి కుదుళ్ళకు పట్టించి మర్దన చేయాలి. గంట తర్వాత తలస్నానం చేయాలి .శనగ పిండి లో మీగడ కలిపి నలుగు పెట్టుకుంటే చర్మం నునుపుగా మెరుపుగా ఉంటుంది. ఎండకు చర్మం కమిలితే గంధం అరగదీసి రోజ్ వాటర్ కలిపి రాసుకోవాలి.