Categories

జట్టు చిక్కులు లేకుండా , ఇంట్లోనే సీరమ్ ను తయారు చేసుకోవచ్చు. నాలుగు చెంచాల కాఫీ పొడి రెండు
స్పూన్ల తేనె లో కాసిన వేడినీళ్ళు పోసి బాగా కలిపి జుట్టుకు పట్టించి కాసేపు ఆగి కడిగేస్తే జుట్టు ధృఢంగా తేమగా మెరిసేలా అయిపోతుంది. అలాగే కొబ్బరి నూనెలో గోరింటాకు వేరి కాగబెడితే నూనెలో గోరింటాకు మరిగి రంగు మారుతోంది. ఆ నూనె వడకట్టి చల్లార బెట్టాలి, అందులో కలబంద గుజ్జు ,జూజూబీ ఆయిల్ విటమిన్ ఇ, లావెండర్ నూనె కలిపితే సీరమ్ తయారయినట్లే దీన్ని సీసాల్లో భద్రంచేసి తలస్నానం చేశాక కొద్దిగా రాసుకొంటే జట్టు ఆరోగ్యంగా చిక్కులు లేకుండా మెరుస్తూ ఉంటుంది.