![](https://vanithavani.com/wp-content/uploads/2020/11/silent.jpg)
వైద్యం అంటే శత్రుత్వం.ఇది రెండు విధాలుగా ఉంటుంది నిమిత్త వైరం,నిష్కారణ వైరం. అప్పటివరకు మిత్రులుగా ఉన్నవారు అకస్మాత్తుగా వచ్చిన ఏదో ఒక వివాదంతో శత్రువులు అవుతారు ఇక ఆ స్నేహం కొనసాగటం కష్టమే మన జీవితంలో ఇబ్బంది పెట్టగలిగేది నిష్కారణ వైరం. అవతలి వాళ్లకు మనం ఎలాంటి హాని చేయము. చేయాలనే ఆలోచనతోను ఉండము, కానీ వాళ్లకు మనమంటే గిట్టకపోతుంది. దీనికి కారణం అవతలివాళ్ళ మనసులోని అభద్రతా మనకంటే తక్కువ తనం ఉండేదనే అభిప్రాయం దీనివల్ల అసూయ అటు తరువాత ద్వేషం ఇలాంటి మనస్తత్వం గల వారితో దూరంగా ఉండటం మాత్రమే చేయగలిగింది పైగా వారి విషయంలో మౌనంగా ఉంటే ఈ విజయం మనదే అవుతుంది వీళ్ళతో ఎలాగో భవిష్యత్తులో కూడా స్నేహం,బంధుత్వం కొనసాగదు కనుక వారి నుంచి ఏదీ ఆశించక పోవటం ఉత్తమం.
చేబ్రోలు శ్యామసుందర్
9849524134