మా అక్క రంగోలి 21 ఏళ్ల వయసులో ఉన్నప్పుడు అవినాష్ శర్మ అన్న అతను ప్రేమిస్తున్నానని వెంటపడేవాడు మా అక్క తిరస్కరించింది. అవినాష్ శర్మ ఇంకో స్నేహితుడితో కలిసి ఆమె పై యాసిడ్ కుమ్మరించాడు ఆమె చెవి చంప ఒక వక్షం పూర్తిగా కాలిపోయి ఆమెకు పూర్వపు మొహం తెచ్చేందుకు యాభై నాలుగు సార్లు కాస్మెటిక్ సర్జరీ చేశారు. అప్పుడు నా వయస్సు 18 ఆ సమయంలో నేను ఆమె భౌతిక ఆరోగ్యం కంటే మానసిక ఆరోగ్యం గురించి ఎక్కువ ఆలోచించాను అంటూ ఇంస్టాగ్రామ్ లో రాసింది కంగనా రనౌత్. యోగ అంతర్గత శక్తులను వెలికి తీస్తుందని నా నమ్మకం ఆమెను యోగ వైపు మళ్ళించారు నెమ్మదిగా ఆమె లో జీవం వచ్చింది యోగ ఆమెలో ఆత్మవిశ్వాసం కలిగించింది. యోగ సాధన పైన నాకు పూర్తి నమ్మకం ఉంది అంటుంది కంగనా రనౌత్.