Categories
ఈ కరోనా సమయంలో బయటి నుంచి తెచ్చిన పండ్లు,కూరలు మొదలైనవి సబ్బుతో డిటర్జెంట్, లేదా బ్లీచింగ్ వంటి వాటితో శుభ్రం చేస్తూ ఉంటారు. వీటికంటే శుభ్రమైన నీటిని వాడటం శ్రేయస్కరం అంటున్నారు న్యూట్రిషనిస్ట్ లు ఆపిల్ పియర్స్ వంటివి శుభ్రమైన నీటిలో కాడ దగ్గర నుంచి పండు మొత్తం కడిగి పెట్టుకోవాలి. నారింజ కమలాలు వంటివి తెచ్చిన రోజే నీళ్లతో శుభ్రం చేసి పెట్టుకుంటే వైరస్ భయం ఉండదు. పాలకూర, కొత్తిమీర, లెట్యూస్ వంటివి ధారగా పై నుంచి పడే నీళ్లలో కడగాలి. క్యాబేజీ పై పొర తీసేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవచ్చా. కొలరాడో స్టేట్ యూనివర్సిటీ వారు వాటిని శుభ్రం చేసేందుకు ఉపయోగించే నీళ్లలో వెనిగర్, నిమ్మరసం కలిపి కడిగితే బ్యాక్టీరియా పోయి కొత్త ఫ్లేవర్ కూడా వస్తుంది అంటున్నారు.