జీన్స్ తో కలిపి స్లిట్ కాటన్ టాప్స్ ధరించటం ఇవ్వాల్టి ఫ్యాషన్. నడుము దగ్గరకు చీలి ఉండటం ఈ స్లిట్ కాటన్ టాప్స్ ప్రత్యేకత ప్రింటెడ్ కాటన్ తో తయారయ్యే ఈ స్లిట్ కాటన్ టాప్స్ చాలా చక్కగా ఉన్నాయి.స్టోన్ వాష్ జీన్స్ కూడా ఈ రకం టాప్స్ కు నప్పుతాయి యాంకిల్ లెంగ్స్ ఫుల్ లెంగ్స్ ఇలా ఏ రకం జీన్స్ కైనా ఈ టాప్స్ చాలా నప్పుతాయి.పొడవాటి టాప్స్ పార్టీవేర్ కొద్దిగా పొడవు తక్కువగా ఉండేవి డైలీ వేర్ గా వాడుకోవచ్చు. స్లిట్ కాటన్ టాప్స్ ధరించినపుడు వీలైనంత తక్కువ జ్యువెలరీ వేసుకోవాలి చెవులకు హోప్స్ బావుంటాయి. ముడి పెట్టుకొని వెండి జుంకాలు పెట్టుకున్న చక్కగా కనిపిస్తాయి. మోకాళ్ళ కింది వరకు లేదా నేలను తాకేలా భిన్నమైన పొడవు కలిగిన టాప్స్ ఎంచుకుంటే వేర్వేరు సందర్భాలలో ధరించేందుకు అనువుగా ఉంటాయి.
Categories