పట్టు చీర తో లాంగ్ ఫ్రాక్ డిజైన్ చేశారు డిజైనర్స్. పట్టు చీర, అంత పెద్ద అంచు కొంగు బరువుతో కట్టుకోవడం కష్టం అనుకునే అమ్మాయిల మనసు దోచేశాయి. ఈ లాంగ్ ఫ్రాక్ లు అనార్కలి తర్వాత లేటెస్ట్ ట్రెండ్ లాంగ్ ఫ్రాకే. ఈ ఫ్రాక్ ఏ వేడుకకో హైలెట్ అయితే ఇంకెంత బాగుంటుంది. అదే కాదు ఎన్నో ఖరీదైన పట్టు చీరలు నాలుగైదు సార్లు కట్టేశాక ఇక అది బీరువా కే పరిమితం అవుతూ ఉంటుంది. ఈ లాంగ్ ఫ్రాక్ ఐడియా వచ్చాక ఇంట్లో సంవత్సరాల తరబడి ఉన్న పట్టు చీరలన్నీ చక్కని లాంగ్ ఫ్రాక్ అయిపోతున్నాయి. భారీ అంచుతో మెరిసే ఫ్యాబ్రిక్ తో లాంగ్ ఫ్రాక్ అన్ని వేడుకలకు అందం తెస్తున్నాయి.

Leave a comment