జామ పండు యాపిల్ పండు కంటే ఎక్కువ మేలు చేస్తుందని చెపుతున్నారు ఎక్స్పర్ట్స్. క్రమం తప్పకుండా జామపండు తింటే బరువు నియంత్రణలో వుంటుంది. ఇందులో పీచు ఎక్కువ, చక్కర పాళ్ళు ఎక్కువ. ఇందులో వుండే విటమిన్ ఎ కంటి చూపు మెరుగుపరుస్తుంది. థైరాయిడ్ వంటి వ్యాధులను నియంత్రణలో ఉంచుతుంది. మెదడును చురుగ్గా ఉంచుతుంది. విటమిన్ బి6, బి3 వంటి పోషకాలు పుష్కలంగా ఉండటంతో మెదడులో న్యురాన్ల పనితీరు బావుంటుంది. రక్తం లో కొలెస్టరాల్ పాళ్ళు తగ్గిస్తుంది. అంతే కాదు అధిక రక్తపోటు నివారిస్తుంది. జామపండును కొరికి తింటే చిగుళ్ళు, పంటి వ్యాధులు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా వుంటాయి.

Leave a comment