మన జీవన విధానంపైన మనం తీసుకునే ఆహరం ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. ఆరోగ్యవంతమైన ఆహరం అంటే రోజువారీ భోజనంతో పాటు ఆరోగ్యవంతమైన స్నాక్స్ తినడం, పూర్తిస్థాయి ధాన్యం, బీన్స్, మొలకలు, కూరగాయలు, పండ్లు, గింజలతో పాటు సోయా మిల్క్, ఆలివ్ ఆయిల్, అవిసె గింజలు, పాలకూర వంటివి తినాలి. ఇవి వత్తిడిని తట్టుకునేందుకు, ఆరోగ్యవంతమైన సమతౌల్యాన్ని కాపాడుకునేందుకు మంచి మూడ్ కోసం అవసరం అవుతాయి. ఆహరపు అలవాట్లు ఆలోచనా విధానం, దృక్పదాల పైన ఎక్కువ ప్రభావం చూపెడతాయి. శారీరక ఎదుగుదలలో తిరుగు లేని ప్రభావం చూపెడతాయి. ఎలా బతుకుతున్నాం, ఎలా ఫీలవుతున్నాం అన్న అంశాల్ని మన జీవిత విధానాన్ని ఈ అలవాట్లు నిర్ణయిస్తాయి. జీవితంలో గోల్స్ సాధించేదుకు ముందు మనసు, శరీరాన్ని ప్రశాంతంగా ఉంచే ఆహారాన్ని తీసుకోవడం ఎంతో ఉపయోగపడుతుంది.
Categories