Categories
Nemalika

పర్ఫెక్షన్ విషయంలో పట్టుదల వద్దు.

నీహారికా,

అన్ని పనులు పర్ఫెక్ట్ గా చేసే అలవాటు మంచిదే అయినా పర్ఫెక్షన్ కోసం అంతా గందరగోళం చేసుకోవడం మాత్రం తప్పే, ఏ పని చేసినా కరెక్ట్ గా ఉండాలనుకోవడం మంచి ధృక్పదమే. అయితే ఏమాత్రం తేడా వున్నా అంగీకరించలేని ధోరణి మాత్రం సబబు కాదు.అందుకే వీలయినంతవరకు పనిని సక్రమంగా ఎంత మాత్రం రాజీ లేకుండా చేయడానికే ప్రయత్నం చేయాలి. జీవితంలో ఎదురయ్యే ఎన్నో ఎన్నో అనుభవాలు, తప్పులు, విజయాలు వికాసంలో సంభవించే చర్యలుగా తీసుకోవాలి. అభివృద్ధి వైపు వేసే ప్రతి అడుగు చెడు నుంచి మంచికి ప్రయాణం కాదు. పర్ఫెక్షన్ నుంచి పర్ఫెక్షన్ కు అనుకోవాలి.మన ప్రతి చర్య అందంగా ఉంచుకోవాలి. ఆ ప్రయత్నంలో చిన్నపాటి తేడాలు రావొచ్చు అంతేకాని ఆ పని పర్ఫెక్ట్ గా లేదని అస్తమానం తలచుకుని బాధ పడటం మాత్రం చాదస్తమే. మొదటి ముంచి ప్రతి పని ఎలాంటి తప్పు లేకుండా చేయాలని ఆశిస్తూ అప్పుడప్పుడు ఫెయిలయినా చేసుకుంటూ పోతుంటే చివరికి పర్ఫెక్షన్ అలవాటైపోతుంది. ప్రతి పని అందంగా పువ్వు పూసినంత బాగా వుంటుంది.

Leave a comment