Categories
ఆఫీస్ ల్లో ఉద్యోగాల మధ్య ఉండే స్నేహాలు కూడా సామర్థ్యాన్ని పెంచుతాయి అంటున్నారు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు క్యాంటీన్ లో కాసేపు తోటి ఉద్యోగులతో కబుర్లు చెప్పుకోవడం చాలా మంచిది అంటున్నారు. ఉదయం నుంచి ఇంటిపని ఆఫీస్ పని తోనే గడిపే ఉద్యోగులకు మానసిక ఒత్తిడి పెరిగి తరచూ అనారోగ్యాలు రావటం, ఒంటరితనం పెరగటం తో వచ్చే మానసిక అసంతృప్తి పోయేందుకు మధ్యలో కాసేపు తోటి వారితో ముచ్చట్లు ఆడితే మంచిదంటున్నారు. పని సామర్థ్యం పెరగాలంటే మధ్యలో కాసేపు రెస్ట్ తో పాటు తోటి ఉద్యోగులతో మాట్లాడుకోవటం మంచిది అంటున్నారు అధ్యయనకారులు.