Categories
కదలిక అనేది జీవుల సహజ లక్షణం. జీవం ఉన్న ప్రతిదీ ఎప్పుడు చైతన్యంతో కదులుతూ ఉంటుంది. ఇలాంటి లక్షణాల వల్లే మనుష్యుల సాహసం చేస్తు శరీరం కదిలికలను పెంచుకొంటూ ప్రయాణం చేసి ఒక స్థాయికి ఎదిగాడు. మానవ పరిణామ దశ ఇలా శరీర శ్రమతోనే సాగింది. మన శరీరంలోను ఇంతకంటే వేగమైన కదలికలుంటాయి పీల్చిన గాలిలోని ఆక్సిజన్ ను తీసుకొన్న ఆహారం లోని శక్తిని గ్రహించి శరీరంలోని ఇతర భాగాలకు అందించే రక్తం నిరంతరం ప్రయాణం చేస్తూనే ఉంటుంది. ఇంత వేగవంతమైన వ్యవస్థను శరీరం లోపల పెట్టుకున్న మనిషి బాహ్యంగా కదిలికలు తగ్గిస్తూ సుఖంగా కూర్చునేందుకు అలవాటు పడుతున్నారు. ఈ స్థితి గమనించుకొని శరీరాన్ని చురుగ్గ ఉంచుకొంటేనే ఆరోగ్యం అంటున్నారు పరిశోధికులు మనిషి ప్రతికదిలికకు ఒక ప్రయోజనం ఉంది.