కలలు ఎవరైనా కంటారు . కానీ కొందరి కలలు మనిషి అభివృద్ధికి ఒక కొత్త దారి చూపిస్తే ఒక కొత్త ఆవిష్కరణకు దారితీస్తే ఎలా ఉంటుంది . ఇది ఆశర్యం కలిగిస్తున్నా వాస్తవం . 1845 లో అమెరికా కు చెందిన ఇలియాస్ హల్ కుట్టు మిషన్ కనిపెట్టేందుకు ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నాడు . నిరంతరం దాన్ని గురించే ఆలోచించే వాడట . అతనికో రోజు ఒక కల వచ్చింది . ఆ కలలో ఇలియాస్ కు రాజుగారు మరణ దండన విధించాడు . సైనికుడు ఇలియాస్ మెడ లో ఒక శూలం గుచ్చాడు అది వెనక వైపు నుంచి బయటకు వచ్చింది శూలానికి చివర ఓ దారం వుంది . సైనికుడు శూలంతో వెనక నుంచి మళ్ళీ పొడిచి ముందు నుంచి బయటకు తీశాడు వెంటనే మెలుకువ వచ్చింది . ఇలియాస్ ఒక చిన్న సూది తయారు చేసి ఒక వైపు బెజ్జం పెట్టి దాన్ని మిషన్ కు జత చేశాడు . అలా కుట్టు మిషన్ తయారై పోయింది .
Categories