జపాన్ లో జరిగిన వరల్డ్ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ లో బంగారు పతకం సాధించింది సిమ్రాన్ శర్మ దృష్టి లోపంతో పుట్టిన సిమ్రాన్ తల్లి సాయంతో చదువు పూర్తి చేసింది. అథ్లెట్ కోచ్ అయినా గజేంద్ర సింగ్ ను పెళ్లి చేసుకుంది.ఇండియన్ ఆర్మీ లో పనిచేసే సింగ్ సిమ్రాన్ ను పరుగుల రాణి గా తీర్చిదిద్దారు. 2021 లో ప్యారిస్ పారా ఒలంపిక్స్ లో పాల్గొనేందుకు అర్హత సాధించిన తొలి భారత అథ్లెట్ గా గుర్తింపు పొందింది. సిమ్రాన్ గత సంవత్సరం చైనాలో జరిగిన పారా ఆసియన్ గేమ్స్ లో 100 మీటర్లు, 200 మీటర్లు టి 12 ఈవెంట్స్ లో రెండు సిల్వర్ పథకాలు పొందింది సిమ్రాన్.

Leave a comment