వేసవి వస్తే కర్బూజా పండ్లు వస్తాయి. తియ్యని మామిడి పండ్లు ఇష్టపడ్డట్లు ఈ దోసపండు రుచితో వుండే కర్బూజా ను పెద్దగా ఇష్టపడరు. కానీ ఇది ఎంతో మంచి పోషకాహారం. ఇందులో చాలా రకాలున్నాయి. నిమ్మ ఫ్లేవర్ లో వుండే లెమన్ డ్రాప్, షుగర్ మెలన్, వైట్ హనీడ్యూ, ఆకుపచ్చని గాలియా, పసుపు రంగు పర్షియన్, కోలగా వుండే శాంటా క్లోజ్, చారలతో వుండే టస్కన్ ఇలా చాలానే వున్నాయి. ఇవి వేసవిలోనే కాదు మిగతా కాలాల్లోనూ వుంటాయి. లంక దోసకాయాలని పిలిచే గోదావరి జిల్లాల లంకల్లో పండే పండ్లు చాలా రుచిగా వుంటాయి. నీటి శాతం ఎక్కువ. పుష్కలంగా కెరోటినాయిడ్లు, కుకుర్చిటాసిన్లు, శక్తివంతమైన యాంటి ఆక్సిడెంట్స్ గా పని చేస్తూ ఎన్నో రకాల కాన్సర్స్ ను, నరాల జబ్బులని తగ్గిస్తాయి. మానసిక ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇందులో వుండే ప్రోటీన్లు, కొల్లాజెన్ పదార్ధాలు కణాల పునర్నిర్మాణానికి తోడ్పడి చర్మం వడలిపోకుండా నిగనిగలాడేలా చేస్తాయి. ఈ అద్భుతమైన వేసవి ఆహారాన్ని మిస్ అవ్వొద్దు.ఆరోగ్యం, అందం కోసం కుడా..

Leave a comment