నటనలో నా అనుభవం తక్కువే కానీ నాకు నాట్యం వచ్చు గనుకనే నా మొహంలో భావాలు పలికించగల గాను. 21 ఏళ్లకే కే జి ఎఫ్ లో రాఖీ బాయ్ తల్లిగా దేశవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను సంపాదించుకో గలిగాను అంటుంది అర్చన జాయిస్. కోలార్ లో చదువుకున్న బెంగళూరు లో భరతనాట్యం నేర్చుకున్నాను. దేశవిదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చాను చదువుకునే రోజుల్లోనే మహాదేవి ధారావాహికలు 100 ఎపిసోడ్ సీరియల్ లో నటించాను. చెన్నై లోని పద్మా సుబ్రహ్మణ్యం డాన్స్ అకాడమీ లో ఫైన్ ఆర్ట్స్ మాస్టర్ చేశాను. అలా నాకున్న నృత్యానుభవం నాకు కే జి ఎఫ్ లో నటించే అవకాశం వచ్చింది అంటుంది అర్చన జాయిస్.

Leave a comment