వ్యాయామం అంటే పరుగులు కాదు కొన్ని అడుగులు నడుస్తూ ఉన్న చాలు అంటున్నారు ఎక్సపర్ట్స్. వారంలో కనీసం 150 నిమిషాలకు తక్కువ కాకుండా రోజూ అరగంట వ్యాయామానికి కేటాయించాలి. ఈ నియమం పాటిస్తే పక్షపాతం, గుండెపోటు, టైప్- 2 డయాబెటిస్ తో పాటు కొన్ని క్యాన్సర్ లకు దూరంగా ఉండచ్చు. బరువులు ఎత్తటం, పరుగులు తీయడం వంటి వ్యాయామాలకు సమయం లేకున్నా శ్వాస తీసుకునే గుండె కొట్టుకునే రేటు పెంచే మధ్యమ స్థాయి వ్యాయామం చేసినా చాలు. నడక, రన్నింగ్ లాగా కాకుండా మెల్లగా మధ్యస్థంగా ఉంటే చాలు రోజులో 10 -15 సార్లు రెండు మూడు నిమిషాలు వంతున వ్యాయామం చేసినా మంచిదే. ఒకేసారి 30 నిమిషాల పాటు నడిచినా ఫలితమే ఉంటుంది. రెండు మూడు నిమిషాలు వేగంగా నడవటం మెట్లు ఎక్కడం కూడా వ్యాయామం చేసినట్లే అంటున్నారు ఎక్సపర్ట్స్ .

Leave a comment