Categories
అమెజాన్ ప్రాంతంలోని బ్రెజిల్ ,పసిఫిక్ తీరంలోని కోస్టారికా పనామా,కొలంబియాల్లో పెరిగే పర్పుల్ ఉడ్ ప్రకాశవంతమైన ముదురు ఉదా రంగులో ఉంటుంది. చెట్టు నుంచి కొట్టిన దుంగను ఉండలో పడేస్తే రోజులు గడిచిన కొద్దీ ఎరుపు ,చాకోలెట్ ,ఊదా రంగుల్లోకి మారి పోతుంది.ఈ అందమైన చెక్కతో చేసే చిరుతలు,టేబుళ్ళు ,కిచెన్ వస్తువులు చాలా అందంగా ఉంటాయి. ఈ రెండు చూసి ముచ్చటపడి ఈ చెక్క ముక్కల్ని బంగారం ప్లాటినంతో పొదిగి ఉంగరాలు ,బ్రాస్ లెట్లు కూడా చేయించుకొంటారు.ఇవి ఖరీదైనవి. ఇంటి నిర్మాణంలో ఈ అందమైన కలపను ఉపయోగించటం ఫ్యాషన్ కూడా.