దక్షిణాదిలో అగ్ర తారలంతా ఇప్పుడు ఐటమ్ సాంగ్స్ కు రెడీ అయిపోతున్నారు. ఇందులో పెద్ద రహస్యం ఏమి లేదు. ఈ పాటకు రెండు మూడు రోజుల షెడ్యుల్. పారితోషకం మాత్రం అడిగినంత. అదే అట్రాక్షన్. జాగ్వార్ లో తమన్నా తన ఐటమ్ సాంగ్ కు 75 లక్షల పారితోషకం అందుకుందిట. ఆగడు ఐటమ్ సాంగ్ శృతి హాసన్ కు 40 లక్షల రూపాయిల పారితోషకం అందింది. రెగ్యులర్ ఐటమ్ గర్ల్ హంసా నందిని, ముమైత్ ఖాన్ లు అయితే 20 నుంచి ౩౦ లక్షలు. జనతా గ్యారేజ్ ఐటమ్ కోసం కాజల్ 63 లక్షల రూపాయిల చెక్ అందుకుంది. అంజలికి సరైనోడు లో పాట కు 45 లక్షల రూపాయిలు ముట్టాయి. లక్ష్మి రాయ్ పారితోషకం ఆర కోటి రూపాయిలంట. మరి ఐటమ్ సాంగ్స్  కి సరే అంటే నష్టం ఏముందీ ?

Leave a comment