ఒక కప్పు కాఫీ తో ప్రతి ఉదయం అద్భుతంగా  మొదలవుతోంది. ఎలాంటి చికాకులు పరాకులు లేకుండా పనిమొదలు పెట్టచ్చు. కాపీ ఆ కాఫీ లోనే  అందం రహస్యం ఉందంటున్నారు. ఎక్స్పెర్ట్స్. సింపుల్ గానే వుంది చిట్కా మంచి డికాషన్ కాఫీ ని ఐస్ క్యూబ్స్ ట్రే లో పోసి ఫ్రిజ్ లో పెడితే అవి ఉదయానికి కాఫీ క్యూబ్స్ గ చేతికొస్తాయి. ప్రతి రోజు ఉదయం ఈ క్యూబ్ తో మొహం పై మర్దనా చేస్తే బ్లడ్ సర్క్యులేషన్ పెరిగి చర్మం నిగారింపు కు వస్తుంది. కండీషనర్ లో రెండు టీ  స్పూన్ల గ్రౌండ్ కాఫీ ని కలిపి జుట్టుకు పట్టేస్తే  ఐదు నిమిషాల పాటు ఉంచి కడిగేసినా చాలు మెత్తని పచ్చు  కుచ్చు లాగా తయారవుతాయి శిరోజాలు. అలాగే నిద్రలేకపోవటం వల్ల  కంటి  పై వత్తిడి పడటం వల్ల  మరే ఇతర కారణాల వల్ల కళ్ళ  చుట్టూ డార్క్ సిర్కిల్స్ ఏర్పడితే అప్పుడు ఒక అర కప్పు  కాఫీ దగ్గర పెట్టుకుని దాన్ని కళ్ళ  కింద అప్లయ్  చేస్తే చాలు. కా కాస్సేపయ్యాక చల్లని నీళ్లతో కడిగిస్తే  సరి. చర్మకణాల పునరుత్పత్తికి కాఫీ గ్రౌండ్స్ బాగా పని కొస్తాయి. దాన్ని స్క్రబ్ మాదిరిగా ఉపయోగించవచ్చు. ఈ పొడితో చర్మం పైన నిదానంగా గుండ్రంగా మర్దనా చేస్తే ఇందులో వుండే కెఫిన్ కొల్లాజైన్ ఉత్పత్తిని పెంచుతుంది. ఈ పద్దతిలో చర్మం ఎంతో సున్నితంగా అందంగా తయారవుతోంది.

Leave a comment