Categories
ఇంగ్లండ్ కు చెందిన మెలోడి హేమ్స్ ఒక చిన్న గుర్రం పిల్లలంటే చాలా ఇష్టం అప్పుడామెకి తోమ్మిదేళ్ళు. ఆ గుర్రం పిల్లకు వళ్ళంతా ఎక్కువగా ఉన్ని ఉండేది. దాంతో అది చాలా అసౌకర్యానికి గురయ్యేది. హెమ్స్ సరదాగా ఆ గుర్రపు ఉన్ని కత్తిరిస్తూ దాని వంటిపైన అందమైన డిజైన్లు సృష్టించేంది. అది అందరి దృష్టిని ఆకర్షించేది. 30 ఏళ్ళు వచ్చాక ఇప్పుడు హెమ్స్ కి అదే వృత్తి కూడా అయింది. ఇరవై ఏళ్ళుగా ఆమె గుర్రాలపై అందమైన డిజైన్లు సృష్టిస్తూ హెమ్స్ చార్టర్ అయిపోయింది. తన ఆర్ట్ వర్క్ ని అందరికీ నేర్పిస్తూ దేశ దేశాలు తిరుగుతోంది. ఈ హార్స్ చార్టర్ ఇప్పుడు ప్రపంచం మెచ్చిన కళాకారిణి. చిత్రమైన అభిరుచి ఆమెకు ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది.