మారేడు నీవని…ఏరేరి తేనా…

మారేడు దళములు నీ పూజకు…

వనితామణులూ!! ఈ రోజు నుండి కార్తీక మాసం మొదలైంది,కార్తీక దీపాలు వెలిగించటం,కార్తీక పురాణం వినడం, ఉపవాసం ఉండడం,వన భోజనం చేయడం మరి ఈ మాసం అంతా భక్తి మయం.
ఈ రోజు ప్రారంభమే కార్తీక సోమవారం.తెల్లవారు ఝామునే లేచి కార్తీక దీపం తులసి కోట వద్ద వెలిగించి ఆ శివయ్య అనుగ్రహం పొందుదాం.జంగమయ్య అభిషేకప్రియుడు కదా!!
సఖులకు దీపావళి, కార్తీకం శుభాకాంక్షలు.ఆయురారోగ్యాలతో అందరినీ చల్లగా చూడాలని ఆ పరమేశ్వరుడిని వేడుకునీ ఆ వేడుక విశేషాలను మరింత అందంగా ఆచరణలో పెట్టే ప్రయత్నం చేద్దాం రండి!!

నిత్య ప్రసాదం: కొబ్బరి, ఆవు పాలతో,పంచామృతాలతో అభిషేకం.

హర హర మహాదేవ.. శంభో శంకరా!!

-తోలేటి వెంకట శిరీష

Leave a comment