చత్తీస్ గడ్ రాష్ట్రం దంతేవాడ అటవీ ప్రాంతంలో కమెండో గా విధులు నిర్వర్తించే  సునయన కు చక్కని పాపాయి పుట్టింది.పాప కడుపులో ఉంటే ఏ తల్లి అయినా అతి భద్రంగా జాగ్రత్తగా ఉంటారు పుట్టబోయే బిడ్డ బాగుండాలని ఎంతో విశ్రాంతి తీసుకుంటారు కానీ అడవి  రక్షణ ఉద్యోగంలో ఉన్న సునైనా పటేల్ మాత్రం అలా విశ్రాంతి గా ఉండాలి అనుకోలేదు రెండు నెలల గర్భవతి గా ఉన్నప్పుడు భుజాలకు 10 కిలోల బరువైన బ్యాగు తగిలించుకుని చేతిలో ఏకే-47 గన్ పుచ్చుకొని అడవంతా తిరిగింది కొండలు లోయలు ఎక్కి దిగింది. కంటిరెప్పల అడవి ని కాపాడింది ఇప్పుడు ఆమెకు నెలలు నిండి చక్కని పాపాయి పుట్టింది. సునయన కు పాపాయికి సామాజిక మాధ్యమాల్లో అభినందనలు వెల్లువగా కురిశాయి.

Leave a comment