కొబ్బరి పాలతో జుట్టుకు పోషకాలు అంది,ఆరోగ్యంగా ఉంటాయని తెలసిందే. ఇంకా ఈ పాలతో ఎన్నో లాభాలు ఉన్నాయంటున్నారు ఎక్స్ పర్ట్స్. కొబ్బరి పాలల్లో కొంచెం పసుపు కలిపి ముఖానికి చేతులకు రాసి ఓ అరగంట అలా వదిలేసి వేడి నీళ్ళతో కడిగేస్తే జీవం లేని పొడి చర్మానికి చక్కని నిగారింపు వస్తుంది. వారంలో నాలుగు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.అలాగే కొబ్బరి పాలలో గంధం పొడి కలిపి మొహానికి ప్యాక్ చేస్తే చర్మం పైన మచ్చలు పోతాయి. అలాగే ఈ పాలలో ,క్యారేట్ గుజ్జు కలిపి ఫేస్ ప్యాక్ చేసి అరగంట పాటు ఆగి కడిగేస్తే చర్మం కాంతిగా తయారవుతుంది.చర్మ సమస్యలు కూడా పోతాయి.

Leave a comment