సాధారణంగా సగం సమయం కంప్యూటర్ ముందే గడుస్తూ ఉంటుంది.అంతసేపు నిర్విరామంగా కంప్యూటర్ చూస్తూ ఉంటే కళ్ళు పొడిబారి పోతాయి. సాధారణంగా కళ్ళు నిమిషంలో 20 సార్లు మూసి తెరుస్తారు.అదే కంప్యూటర్ చూస్తే సగం సార్లే కళ్ళు మూసి తెరుస్తారని పరిశోధనలు చెబుతున్నాయి.దీంతో కన్నీళ్ళు ఆవిరై కళ్ళు పొడిబారి పోతాయి.అందుకే ప్రతి రెండు గంటలకొకసారి పది నిమిషాలు కంప్యూటర్ నుంచి దృష్టి మరల్చాలి.కంప్యూటర్ కి కాస్తా దూరంగా కూర్చుని పని చేయాలి.గదిలో వెళుతూరు బట్టి కంప్యూటర్ కాంతి సరి చేసుకోవాలి.కళ్ళను రక్షించే కళ్ళ అద్దాలు కూడా వచ్చాయి.వైద్యులను సంప్రదించి వీటిని ఎంచుకోవడం మంచిదంటున్నారు.

Leave a comment