ప్రతి ఉదయాన్ని కాఫీ తోనే పలకరించే వాళ్ళు ఉన్నారు. కాఫీ తయారు చేసే కాఫీ పొడితో ఇతర ప్రయోజనాలున్నాయి. కాఫీ గింజలు మెత్తగా పొడి చేసి చర్మానికి స్క్రబ్ గా వాడితే చర్మంలోని టాక్సిన్లు పోయి మృదువుగా తయారవుతుంది.కాఫీ పొడి మంచి ఎయిర్ ఫ్రెషనర్ కూడా. వాడేసిన కాఫీ పొడి కప్పులో పోసి ఫ్రిజ్ లో పెడితే దుర్వాసన రాదు.కాఫీ పొడి పేస్ట్ గా చేసే శిరోజాలకు రాసి 20 నిమిషాల తర్వాత తలస్నానం చేయొచ్చు.ఉల్లి వెల్లుల్లి వంటకాలు తిన్న తర్వాత వాటి వాసన చేతులకు అంటుతుంది అది పోవాలంటే కాస్త కాఫీ పొడి చేతుల్లో వేసుకుని రుద్ధి  కడుక్కుంటే చేతులు కమ్మని వాసన వేస్తాయి.

Leave a comment