Categories
చాలా మంది చేసే కంప్లైట్ మతి మరుపు వస్తోంది అని .ఎన్నో విషయాలు గుర్తు పెట్టుకోవటం ఒకే సారి ఐదారు పనులు చేయటం వల్ల కూడా మెదడు అంత జ్ఞాపకాన్ని పదిలంగా ఉంచుకో లేకపోతుంది అంటున్నాయి అధ్యయనాలు. జ్ఞాపక శక్తి తగ్గటం ,పెద్ద వాళ్ళలో ,పిల్లల్లో కూడా ఎక్కువ అవుతుంది. ఒక అధ్యయనం అహారపు అలవాట్లతో జ్ఞాపక శక్తి వృద్ధి అవుతుంది అంటోంది . కాల్షియం ఎక్కువగా దొరికే పాలు ,బట్టర్ ,పెరుగు వంటివి మెదడు చురుకు దనం కోసం ఉపయోగపడుతాయి. ముఖ్యంగా పెరుగులోని ఎమినో యాసిడ్స్ జ్ఞాపక శక్తిని మెరుగు పరుస్తాయి. క్యారెట్ ,కాలిఫ్లవర్ ,కొత్తిమీరాను మిరియాల పొడి ,నిమ్మరసం కలిపి ఎక్కువగా మజ్జిగా తాగితే ఆందోళన తగ్గి జ్ఞాపక శక్తి పెరుగుతుంది.