మెడ వెనుక చర్మం చాలా త్వరగా పిగ్మెంటేషన్ కు గురవుతూ ఉంటుంది. డార్క్ లైన్స్ మాగు వెంట్రుకలు ,మెడ ముందు భాగంలో ముడతలు ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి. ఇక్కడి చర్మం సున్నితంగా ఉండటం వల్లనే ఈ సమస్యలు వస్తాయి. కనీసం రెండు సార్లు క్లెన్స్ చేయాలి. మైల్డ్ స్క్రబ్ తో రుద్దటం వల్ల చర్మం మృదువుగా అవుతుంది. పగటి వేళల్లో సన్ స్క్రీన్ ,రాత్రి వేళ మాయిశ్చ రైజర్ క్రీమ్ అప్లైయ్ చేయాలి. పై వైపుకు మసాజ్ చేయాలి. ఈ మసాజ్ వల్ల రక్త ప్రసరణ మెరుగై డార్క్ లైన్స్ ముడతలు పోతాయి. శనగపిండి ,పసుపు నిమ్మరసం ,పాల మీగడ కలిపి అప్లైయ్ చేస్తే నలుపు పోతుంది.

Leave a comment