ఈ చలి రోజుల్లో ఎండ తక్కువై ఇంట్లో దుర్వాసన లు వస్తాయి. చిన్న చిట్కాలతో వీటిని తరిమేయవచ్చు. ఐస్ ట్రే లో నిమ్మ చెక్కలు వేసి, వెనిగర్ తో నింపి ఫ్రీజర్ లో గడ్డి కట్టించాలి .ఐస్ ముక్కలు చెత్త డబ్బాలో వేస్తే దుర్వాసన రాదు. అలాగే వెనిగర్ వేసిన వేడి నీళ్లలో టవల్స్ కాసేపు నానబెట్టి ఉతికితే ఫ్రెష్ గా ఉంటాయి. వాష్ రూమ్ లో గోడలకు ఫంగస్ పడితే కప్పు వెనిగర్ తో కొన్ని చుక్కల లెమన్ ఎసెన్షియల్ ఆయిల్, కొన్ని చుక్కలు టీట్రీ ఆయిల్ కలిపి స్ప్రే చేస్తే ఫంగస్ పోతుంది. బూట్లలో బేకింగ్ సోడా వేసి కాసేపు అలా వదిలేసి తుడిస్తే వాసన లేకుండా ఉంటాయి.

Leave a comment