అంతరిక్ష యానం చేసిన మొదటి భారతీయ మహిళగా కీర్తి గణించింది కల్పనా చావ్లా. కల్పనా చావ్లా విద్యాభ్యాసం పంజాబ్ ముల్తాన్ జిల్లా కర్నాల్ జరిగింది ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదివింది. స్పేస్ మిషన్ లో రోదసి లోకి ప్రయాణం చేసేందుకు నాసాలో శిక్షణ పొందింది. 1996 లో కొలంబియా షటిల్ మిషన్ కు ఎంపికయింది. మొదటి ఆసియా అంతరిక్ష యాత్రికురాలిగా కొలంబియా లో ప్రయాణం చేసింది. అంతరిక్షం లో 376 గంటల 34 నిమిషాలు గడిపింది. మళ్లీ ఆ విజయం ఇచ్చిన ఉత్సాహంతో రెండోసారి రోదసీ లోకి ప్రయాణం చేసి ప్రమాదవశాత్తు కొలంబియా ముక్కలై ఆమె మరణించింది. దేశంలో ఎన్నో విద్యాలయాల్లో ఆమె పేరిట స్కాలర్షిప్ ఉన్నాయి.

Leave a comment