అందమైన కమలం సౌందర్య పోషణలో ఎంత గానో ఉపయోగపడుతుంది తామరపువ్వుల పొడి మార్కెట్ లో దొరుకుతోంది.రెండు స్పూన్ల తామరపూల పొడి లో టేబుల్ స్పూన్ పాలు కలపాలి.దీన్ని మొహం మెడకు పట్టించి పావుగంట పాటు ఆరపోవ్వాలి తర్వాత శుభ్రంగా కడిగేసుకోవాలి.వారానికి రెండు సార్లు ఈ తామరపూల ప్యాక్ వేసుకుంటే ముఖం మెరిసిపోతుంది అలాగే జుట్టు పొడిబారకుండా కాపాడుతోంది తామరపూల పొడి, ఉసిరి పొడి, గుంటగలగర పొడి రెండేసి టేబుల్ స్పూన్ ల చొప్పున తీసుకోవాలి నీళ్లలో కలిపి ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించాలి అరగంట తరువాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయాలి ఇలా చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.

Leave a comment