ఆ మార్కెట్ కెంపు వర్ణం తో మెరిసి పోతూ ఉంటుంది. బంగ్లాదేశ్ లోని బోగ్రా జిల్లా మహాస్థాన్ గాడ్ మార్కెట్ లో ప్రతినిత్యం ఎరుపు బంగాళదుంపల కుప్పలు రత్నాల రాసుల్లా కనిపిస్తాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా పండించే రెడ్ స్కిన్ పొటాటో లను రైతులు నేరుగా ఇక్కడికి తీసుకువచ్చి నీటితో శుభ్రం చేస్తూ తడి ఆరే వరకూ ఎండలో పరుస్తూ అమ్మకానికి సిద్ధం చేస్తారు. అంగడి అంతా పరచుకొన్న ఎర్రని బంగాళదుంపల రాసుల అందాన్ని ఫోటోలు తీసేందుకు ఫోటోగ్రాఫర్ పోటీపడుతుంటారు.

Leave a comment