Categories
జుట్టు అందం కోసం పోషణ చాలా అవసరం జుట్టు పొడి బార కుండా ఆలివ్,కొబ్బరి నూనెల మిశ్రమానికి నాలుగు చుక్కల గులాబీ నూనె కలిపి తలకు పట్టించాలి ఇరవై నిముషాలయినా వేళ్ళతో కుదుళ్ళ వరకు మర్దన చేయాలి అలాగే బాదం నూనె కొబ్బరి నూనె కలిపి తలకు మర్దన చేసిన మంచిదే . ఇలా చేస్తే కుదుళ్ళు బలంగా అయిపోతాయి షాంపూ తర్వాత గ్రీన్ టి ని చివరి రిన్స్ గా వాడుకోవాలి. నాలుగు కప్పుల గ్రీన్ టి లో నిమ్మకాయ పిండి షాంపూ తర్వాత రిన్స్ గా వాడాలి కొబ్బరి నూనె మాదిరిగానే కొబ్బరి పాలు కూడా శిరోజాల ఎదుగుదలకు సహకరిస్తాయి. జుట్టు పోషకాలు అందించటంతో ఎదుగుదలలో కొబ్బరి పాలు చాలా బాగా ఉపయోగపడుతాయి. ఆయుర్వేదం ప్రకారం జుట్టుకు పోషణ ఇచ్చే అద్భుతమైన ఔషధం కొబ్బరి పాలు.