వారానికి ఒక్కసారి షాపింగ్ చేసి ఇంటికి కావాలసినవి తెస్తాము .అయితే అన్నీ ఫ్రిజ్లో ఉంచలేము .నిల్వ చేసే విధానంలో కాస్త శ్రద్ధ పెడితే చాలు .మెల్లుల్లిని ప్లాస్టిక్ బ్యాగ్ లో ,డబ్బాలో జాగ్రత్త చేయవచ్చు . నెల రోజులయినా పాడవకుండా ఉంటాయి. ఉల్లి పాయలు పొడిగా ,వెలుతురుపడని చోట ఉంచితే మొలకలు రావు. బంగాళ దుంపలు ఉల్లిపాయలు కలిపి ఒకే చోట పెడితే బంగాళాదుంపలకు మొలకు వస్తాయి. క్యాబేజీ ఫ్రీజ్ లో ఉంచటమే మేలు. టోమోటో లు కొనేరప్పుడే కొన్ని పచ్చిని ,పండువి తీసుకొంటే వాటిని వెలుగుపడని చోట పేపర్లతో చుట్టి పెట్టాలి. పండిన టోమోటోలు వాడేయాలి. క్యారేట్ లను అల్యూమినియం ఫాయిల్ లో చుట్టి చివర్లు తెరిచి ఉంచాలి. లేకపోతే తేమ తగిలి కుళ్ళిపోతాయి.

Leave a comment