ప్రకటనలు చాలా మోసం చేస్తాయి. ప్రోడక్ట్ అమ్ముకొనేందుకు వ్యాపారులు పన్నే ప్యూహంలో వినియోగదారులు పడిపోతారు ఆపై నష్టపోతారు. అలాంటిదే ఈ ఎత్తు పెరిగించే మందు . ఎత్తు పెంచి తగ్గించే మందులు ఉండవు. పిల్లలు లాంగ్ ఫేజ్ లో గబగబా పొడవు పెరుగుతారు. రెండవది ల్యాగ్ ఫేజ్. ఈ ల్యాగ్ ఫేజ్ లో పెరగడం చాలా మందకోడిగా సాగి ఆగిపోతుంది. 21 సంవత్సరాలు వచ్చే సరికి ఎముక పెరుగుదల ఆగిపోతుంది. మందులు వాడితే పెరుగుతారని చెప్పటం మోసపుచ్చటమే. మనిషి ఎత్తుకు , వ్యక్తిగత సామర్ధ్యాలకు సంబంధం లేదు. కాస్త ఎత్తు తక్కువగా ఉన్నా పెద్ద నష్టమేమి ఉండదు. కాని మందులతో పెరగటం అనే మాట మరిచిపోవాలి.

Leave a comment