స్వాంతన ఇచ్చే లావెండర్ ఔషధ గుణాల గురించి మనకు తెలుసు . ఎన్నో శతాబ్దాల క్రితం ఫ్రెంచ్ వాళ్ళు ఈ మొక్కల వాణిజ్య విలువ గమనించి ఎకరాల కొద్దీ వేలల్లో వీటిని పండించటం మొదలు పెట్టారు . ఈ పూలు పూసే సమయం ఒక అపురూపమైన దృశ్యం నేలంతా వంగ రంగులోకి మారిపోతుంది ఈ అందమైన తోటల్ని చూసేందుకు ప్రపంచ వ్యాప్తంగా టూరిస్ట్ లు క్యూ కడతారు . ఈ పూవుల సీజన్ జూన్ తో మొదలై ఆగస్టు తో ముగుస్తుంది . రైతులకు ఎంతో ఆదాయం ఇస్తుందీ లావెండర్ సాగు . యవ్వనాన్ని ,నిద్రని ఇచ్చే ,ఒత్తిడిని తగ్గించే ఈ లావెండర్ ని ఒక్కచుక్క స్నానంచేసే నీళ్ళలో వేసుకొంటే చాలు అద్భుతమైన ఫలితాలుంటాయి . ప్రాన్స్ లోని ప్రావెన్స్ ,ల్యూబెరాన్ ,లెటెన్ సోల్ పీఠ భూములు ఈ లావెండర్ తోటలకు ప్రసిద్ధి చెందాయి .

Leave a comment