హాయిగా నవ్వుతూ నవ్వించే వారి చుట్టూ ఎప్పుడూ పది మంది స్నేహితులు ఉంటారు ఇతరులను నొప్పించని హాస్యం మనుషులను దగ్గర చేస్తుంది. తమపైన తామే జోక్ వేసుకొని హాస్యాన్ని సృష్టించటం అద్భుతమైన కళ. ఏ ఆయుధమైన మనం వాడే తీరునుబట్టి ఫలితం ఇస్తుంది. హాస్యం కూడా ఆయుధం వంటిదే ఇతరులను చిన్న బుచ్చే హాస్యం గాయపరుస్తుంది.ఇతరులలో ఉండే ఏదో బలహీనత చుట్టూ సృష్టించే  హాస్యం  వాళ్ళని అపహాస్యం చేయటం వంటిదే ఇతరుల కష్టాలు, అనారోగ్యాలు లోపాలు హాస్యానికి ఆధారం కాకూడదు.అలాంటి హాస్యం ఆక్షణంలో నవ్వు తెప్పించిన అది అవతల మనిషి హృదయానికి బాణం లాగా గుచ్చుకునే ప్రమాదం ఉంటుంది. సున్నితమైన హాస్యం ఎందరో స్నేహితులను తెచ్చిపెడుతుంది.ప్రేమ నుంచి పుట్టుకొచ్చే హాస్యం చందన స్పర్శ వంటిది.గాలిలో తేలి వచ్చే మొగలి పూల పరిమళం వంటిది. మంచి హాస్యం ఆనందం పంచుతుంది.

చేబ్రోలు శ్యామసుందర్  
9849524134 

Leave a comment