ప్రముఖ నటి ఏంజెలినా జోలీ ఎగ్జిక్యూటివ్ నిర్మాత గా పనిచేసిన ఈ చిత్రం ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా అకాడమీ అవార్డు గెలుచుకొంది.  14 సంవత్సరాల అమ్మాయి హారూట్ స్కూల్ నుంచి వస్తుంటే ‘తండాలె’ అన్న యువకుడు ఆమె పై అత్యాచారం చేశాడు ఆ గ్రామ నియమం ప్రకారం ఆడపిల్లలు మొదటిసారిగా అనుభవించిన వారికే భార్య అవుతుంది హారూట్ అక్కడనుంచి పారిపోతూ చేతికి అందిన తండాల్ తుపాకీ తో అతన్ని కాల్చి చంపేస్తుంది. ఆమెను అరెస్టు చేస్తారు స్త్రీలపై జరిగే అత్యాచారాలకు వ్యతిరేకంగా,స్త్రీల పై అత్యాచారాలకు వ్యతిరేకంగా వారి హక్కుల పై పోరాడే న్యాయవాది మీజా హారూట్ తరఫున వకాల్తా తీసుకుంటుంది. హారూట్ తరఫున సాక్ష్యం ఇచ్చేందుకు ఎవరూ ఉండరు ఈ లోగా ప్రభుత్వం మీజా నడుస్తున్న ఎన్జీవో ని రద్దు చేస్తుంది.అప్పటికే ఈ కేసులో ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది.ఎప్పటికో హీరోట్ ను  నిర్దోషిగా ప్రకటి స్తుంది కోర్ట్. ఇన్ని అనుభవాల తరవాత హీరోట్ తన జీవితం తాను స్వతంత్రంగా జీవించగలనని తెలుసుకుంటుంది. ఈ సినిమా వాస్తవ కథ ఆధారంగా తీశారు.ఈ సినిమా యూట్యూబ్ లో ఉంది తప్పకుండా చూడండి.

రవి చంద్ర.సి  
7093440630  

Leave a comment