హైబ్రీడ్ కురగాయలకు తోడుగా ఇప్పటి వరకు మనం చుసిన కొన్ని రంగులకు భిన్నంగా కొత్త కొత్త రంగులతో, మరిన్ని రుచులతో ఉపయోగాలతో పండ్ల కూరలు వస్తున్నాయి. ఆపిల్ కొస్తే తెల్లగా వున్నా కాసేపు గాలి తగిలేసరికి ముదురు గోధుమ వర్ణం లోకి మరి పోతుంది. గాలి లోని ఆక్సిజన్ పండ్ల ముక్కల లో ని పాలిఫినాల్ అక్సిడైజ్ ఎంజైమ్ తో కలవడం వల్ల ఇలా కోసిన పండ్లు, కూరగాయల రంగు మారిపోతుంది. ఇలా మారిపోకుండా 20 ఏళ్ళ పాటు కృషి చేసి పండించిన ఆర్కిటిక్ ఆపిల్ ఈ ఏడాది ప్రపంచ మార్కెట్ లోకి అడుగు పెట్టింది పసుపు రంగులో వుండే యాపిల్ ముక్కలు పచ్చగానే ఉంటాయి. ఈ యాపిల్ రుచి చాలా బావుంటుందిట. ఈ పాటికి మన మార్కెట్ లోకి వచ్చిందేమో చూడండి.

Leave a comment