Categories
ఒంటరితనం, ఒంటరిగా ఉండటం రెండు వేరు వేరు అయినా ఒంటరిగా ఉండాలనుకునే ధోరణి మానసిక ఆరోగ్యానికి మంచిది అంటున్నారు సైకాలజిస్ట్ లు. నీతో నువ్వు ఉన్నప్పుడే నువ్వేమిటో అర్థం అవుతావు ఏం చేయాలో చేయకూడదో స్పష్టంగా ఉంటుంది. ఇష్టాలు, అయిష్టాలు వేసుకుంటే స్పష్టమైన మార్గం తెలుస్తుంది అంటారు. ఒంటరిగా ఉండటం అంటే సోషలైజ్ అవుతూనే ఏకాంతంగా ఉండటం. ఎవరికి వాళ్లే జడ్జ్ గా ఉండటం పోలికలు చూడకుండా జీవితాన్ని గడపటం ఆరోగ్యకరం. మన కోసం మనం సమయం కేటాయించుకోవటమే జీవితం, అదే ఆరోగ్యకరం అంటారు సైకాలజిస్ట్ లు.